- Advertisement -
అమరావతి: కడపలోని పబ్బపురం హైవేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు నుజ్జు నుజ్జు కావడంతో పాటు కడప పిడి మెప్మా సతీమణి మృతి చెందింది. పిడి మెప్మాతో సహా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -