న్యూఢిల్లీ: కేరళలోని త్రిసూర్ జైలులో రెండేళ్ల క్రితం జరిగిన ఒక విచారణ ఖైదీ మృతికి సంబంధించి ఆరుగురు జైలు అధికారులపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2020లో ఒక డ్రగ్స్ కేసులో షమీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 2020 సెప్టెంబర్ 29న కారులో వెళుతున్న దినసరి కూలీ అయిన షమీర్, అతని భార్య, ఇద్దరు వ్యక్తులను డ్రగ్స్ కలిగి ఉన్నారన్న ఆరోపణపై త్రిసూర్ పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్ నిబంధనల కారణంగా వారిని క్వారంటైన్ వసతిలో ఉంచారు. అనంతరం..2020 అక్టోబర్ 1న షమీర్‌ను త్రిసూర్ జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా..షమీర్ మరణాన్ని ఆత్మహత్యగా స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. షమీర్ మృతదేహంపై గాయాల తాలూకు చిహ్నాలు ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో దీనిపై దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరుగురు జైలు అధికారులపై హత్య, సాక్ష్యాల చెరిపివేత నేరాలకు సంబంధించిన సెక్షన్లను చేరచాలలో కోర్టుకు సూచించింది. అయితే..గత ఏడాది కేరళ ప్రభుత్వం సిఫార్సు మేరకు గత ఏడాది ఈ కేసును చేపట్టిన సిబిఐ నిబంధనల ప్రకారం కేసును మళ్లీ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
CBI Probe in Murder case of Thrissur Jail inmate