న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే అన్ని వ్యాక్సిన్లలో దాదాపు 60 శాతం భారత్‌లో ఉత్పత్తి చేసినవేనని, ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచానికి వ్యాక్సిన్లు అందిస్తున్న భారత్… ఎన్నో వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్లను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. స్వదేశంలో లాక్‌డౌన్ సమయంలోనూ కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసి అర్హులైన ప్రతి పౌరుడికి రెండు డోసులు భారత్ అందించిందని చెప్పారు. కేంద్ర సర్వీసులో పనిచేస్తోన్న సజ్జన్ సింగ్ యాదవ్ అనే అధికారి రాసిన ఇండియా వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడమనేది భారత్ డిఎన్‌ఎలోనే ఉందన్నారు. కరోనా వేళ నిర్ణీత సమయంలో దేశ వ్యాప్తంగా 200 కోట్ల డోసులను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటివరకు మొత్తం 208.57కోట్ల వ్యాక్సిన్ డోసులను అందజేసినట్టు వివరించారు.
India Supplies 60 percent of Vaccines: Nirmala Sitharaman