హైదరాబాద్: వెనుకబడిన వర్గాలను ఏకం చేసి రాజ్యాలను పాలించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పాపన్న372వ జయంతి వేడుకలలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు పాపన్నను చరిత్రలో లేకుండా చేశాయని తలసాని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో పాపన్న జయంతిని ప్రభుత్వ ఆద్వర్యంలో నిర్వహిస్తోందన్నారు. లండన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు చరిత్రను పొందుపర్చారని చెప్పారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు ఆత్మగౌరవంతో బతకాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. చరిత్రలో నిలిచిన అనేక మంది మహానీయులను తెలంగాణ సర్కార్ తగురీతిలో గౌరవించేలా కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి తలసాని పేర్కొన్నారు.
పాపన్న 372వ జయంతి వేడుకలలో పాల్గొన్న మంత్రులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -