Monday, January 20, 2025

రష్యాలో పదిమంది పిల్లల్ని కనే మహిళకు నజరానా

- Advertisement -
- Advertisement -

Russia to award women who give birth to 10 children

మాస్కో : గత కొంతకాలంగా రష్యాలో జనాభా తగ్గుతోంది. దీంతో అధ్యక్షుడు పుతిన్ దేశంలో జనాభాను పెంచుకోడానికి సోవియట్ కాలంలో అమలులో ఉన్న ఓ పురస్కారాన్ని మళ్లీ పునురుద్ధరించారు. 10, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు మదర్ హీరోయిన్ అవార్డును ప్రకటించారు. పది మంది అంతకంటే ఎక్కువ పిల్లలను కనే మహిళలకు మిలియన ( భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలకు పైన ) నజరానా ఇస్తామని పుతిన్ సర్కారు ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. 10 వ బిడ్డ మొదటి పుట్టిన రోజు నాడు ఈ నగదు చెల్లిస్తారు. అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టారు. నిజానికి ఈ అవార్డును 1944 లో అప్పటి సోవియట్ ప్రీమియర్ జోసెఫ్ స్టాలిన్ ప్రవేశ పెట్టారు. యూఎస్‌ఎస్‌ఆర్ గౌరవ పురస్కారంగా పేర్కొంటూ దాదాపు 4 లక్షల మంది పౌరులకు ఈ అవార్డు అందజేశారు. ఇప్పుడు రష్యా జనాభా పెంచడానికి ఈ అవార్డును మళ్లీ వెలుగు లోకి తీసుకురావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News