Friday, November 22, 2024

ఫెడ్ బ్యాంకు దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

Twist in Fedbank robbery

చెన్నై : స్థానిక అరుంబాక్కం లోని ఫెడ్ బ్యాంక్ దోపిటీ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు లోకి వచ్చింది.ఈ దోపిడీలో ఒక పోలీస్ పాత్ర కూడా ఉందని తెలిసి కేసు విచారణ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. అచరపక్కం ఇన్‌స్పెక్టర్ అమల్ రాజ్ ఇంటో చోరీకి గురైన బంగారంలో 3.5 కిలోల బంగారం దొరికింది. పోలీసులు ఆ బంగారాన్ని సీజ్ చేశారు. అంతేకాదు, అమల్ రాజ్ చోరీ చేసిన దొంగలతో కాంటాక్టులో ఉన్నట్టు కూడా విచారణలో తేలింది. ఈ బ్యాంకు దోపిడీ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, మరొకరిని కూడా అదుపు లోకి తీసుకుని , అతడి నుంచి 14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ దోపిడీ జరిగిన వెంటనే సూర్య అనే వ్యక్తి 14 కిలోల బంగారం నగలతో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి ఆర్‌ఎస్ పురం లోని ఓ నగల దుకాణంలో వాటిని కరిగించాడని పోలీసుల దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆ నగల దుకాణం యజమానిని అరెస్టు చేశారు. సూర్య నుంచి 14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో దోపిడీకి గురైన మొత్తం నగలు స్వాధీనం అయినట్టు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News