Monday, December 23, 2024

సిబిఐ దాడుల్లో ఏమీ దొరకదు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

 

Sisodia

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత శుక్రవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 21 చోట్ల, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఐఏఎస్ అధికారి అరవ గోపీ కృష్ణ ప్రాంగణాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. గతేడాది నవంబర్‌లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని వారు తెలిపారు. ఢిల్లీ ఎల్-జి వికె సక్సేనా, కేజ్రీవాల్ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ, 2021-22పై నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలపై సిబిఐ విచారణకు సిఫారసు చేశారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. ‘‘సిబిఐకి స్వాగతం.. పూర్తి సహకారం అందిస్తాం. ఇంతకుముందు కూడా సోదాలు/దాడులు జరిగాయి, కానీ ఏమీ దొరకలేదు. ఇప్పుడు కూడా ఏమీ దొరకదు’’ అని పేర్కొన్నారు.

GNCTD చట్టం 1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ (ToBR)-1993, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం-2009 మరియు ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్-2010 యొక్క ప్రాథమిక ఉల్లంఘనలను చూపుతూ జూలైలో దాఖలు చేసిన ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదికపై సిబిఐ విచారణకు సిఫార్సు చేసినట్లు వారు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News