హైదరాబాద్: ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం గొప్ప ప్రగతిని సాధించిందని ఐటి,పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణనే చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ఎన్నో విన్నూత్న పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి కెటిఆర్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న టీ-హబ్‌లో జరిగిన డిప్లొమాటిక్ ఔట్‌రిచ్ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు అయిందన్నారు. 2014లో తెలంగాణ జిఎస్‌డిపి రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి రూ.11.55 లక్షల కోట్లకు చేరిందని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో ఇదేవిషయం చెప్పానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ‘త్రీఐ’ మంత్రతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి వెల్లడించారు. దేశంలో యంగెస్ట్ రాష్ట్రమైన తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కెటిఆర్ వివరించారు.
Live: IT & Industries Minister @KTRTRS sharing his thoughts at the ‘Diplomatic Outreach Program’ at @THubHyd https://t.co/HHYbg8ha54
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 19, 2022