Saturday, November 23, 2024

మునుగోడులో ఎవరెవరు తలపడతారు?

- Advertisement -
- Advertisement -

 

Munugode bye-election

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో పట్టుసాధించేందుకు, గెలిచేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్), భారతీయ జనతా పార్టీ(బిజెపి), కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. కులం ఇక్కడ నిర్ణయాత్మక పాత్రను పోషించగలదని భావిస్తున్నారు. మునుగోడులో ఎక్కువ వరకు ఉండేది వెనుకబడిన తరగతి(బిసి) వారే. ముఖ్యంగా గౌడ్లు, ముదిరాజ్‌లు, యాదవులు, పద్మశాలిలు. ఈ కులాల వారే నిర్ణయాత్మక పాత్ర పోషించగలరని తెలుస్తోంది. ములుగోడ్ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఉంది. భోన్‌గిర్ లోక్‌సభ నియోజక వర్గంలో భాగంగా ఉంది. ఇక్కడ దాదాపు 2.1 లక్ష మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో బిసిలదే సింహ భాగం. గౌడ్లు, ముదిరాజ్‌లది దాదాపు 30 శాతం, యాదవులది 10 శాతం, పద్మశాలీలది 5 శాతం ఉంది. కాగా రెడ్డి కులానికి చెందినవారు 3.5 శాతం, ఎస్సీలు 16.5 శాతం, ఎస్టీలు 10 శాతం, ముస్లింలు 3.5 శాతంగా ఉన్నారు. వీరుకాక కమ్మ, మున్నూరు కాపు, వెలమలు, ఇతర కులస్తులు కూడా తక్కువ శాతంలో ఉన్నారు.

కోమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మునుగోడు నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచారు. దానికి ముందు 2014లో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచారు. దానికంటే ముందు ఆ నియోజకవర్గం నుంచి రెండుసార్లు సిపిఐ అభ్యర్థి గెలిచారు. మునుగోడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నియోజకవర్గం. కాంగ్రెస్ తరఫున పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అక్కడ గతంలో ఐదుసార్లు గెలుపొందారు. ఈసారి ఇక్కడి బరిలో బిజెపి తొలిసారి(డెబూ) పోటీపడబోతున్నది.
ఇదిలా ఉంటే, మునుగోడు ఎన్నికలకు రెడ్డి కుల అభ్యర్థిని, లేక బిసి కుల అభ్యర్థిని…ఎవరిని ఎంచుకోవాలనే మీమాంసలో టిఆర్‌ఎస్ ఉందని అనుకుంటున్నారు. బిజెపి తమ పార్టీ తరఫున కొమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిని, కాంగ్రెస్ పాల్వాయి శ్రవంతి రెడ్డిని నిలబెట్టే అవకాశాలున్నాయి. టిఆర్‌ఎస్ తరఫున అక్కడ బిసి అభ్యర్థిని నిలబెట్టాలని అక్కడి బిసి స్థానిక నాయకులు కోరుకుంటున్నారు. మునుగోడులో ఎవరిని నిలబెట్టాలన్నది కెసిఆర్ నిర్ణయించనున్నారు. పాల్వాయి శ్రవంతికి కాంగ్రెస్ టికెట్ లభించకుంటే ఆమె టిఆర్‌ఎస్ వైపుకు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఆమె కుటుంబానికి అక్కడ మంచి రికార్డు ఉంది. ఏది ఏమైనప్పటికీ మునుగోడు ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు ‘హిజ్జత్ కా సవాల్’ కాబోతోంది. ఓడిపోయిన వారి ముఖం చెల్లకుండా పోతుందన్నది సత్యం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News