- Advertisement -
ముంబయి: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో ఉట్టికొడుతుండగా అందరూ జారిపడడంతో 111 మంది భక్తులు (గోవిందాస్) గాయపడిన సంఘటన మహారాష్ట్రలోని బ్రీహాన్ ముంబయి మున్సిపల్ లో జరిగింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి 88 మందిని డిశ్చార్జ్ చేయగా 23 మంది చికిత్స పొందుతున్నారు. 23 మంది ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో పిరమిడ్ రూపంలో (దహి హండి) ఒకరిపై ఒకరు ఎక్కి ఉట్టి కొడుతున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.7 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక వేళ ఎవరైనా మరణిస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది.
- Advertisement -