ఇండియన్ పాలిటీ స్పెషల్-14
శాసన అధికారాలు
రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగం
ఆర్టికల్ 111 ప్రకారం ఉభయ సభలు ఆమోదించిన బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం.
రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ఆహ్వానిస్తారు. సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేస్తారు.. అనగా సమావేశాలు ప్రొరోగ్ చేస్తారు.
ప్రధాని సలహాపై లోక్‌సభను రద్దు చేస్తారు.
ఆర్థిక బిల్లు రాష్ట్రపతి పూర్వ అనుమతితో లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి.
ఆర్టికల్ 108 ప్రకారం..ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.
కొత్త లోక్‌సభ తొలి సమావేశంలో, ప్రతి ఏడాది బడ్జెట్ సమావేశంలో తొలి ప్రసంగం చేస్తారు. పార్లమెంట్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేస్తారు.
కార్యనిర్వహణ అధికారాలు
ఆర్టికల్ 53 దేశ కార్యనిర్వాహక విధులు రాష్ట్రపతి నిర్వర్తిస్తారు.
రాష్ట్రపతి కార్యనిర్వహక విధులను స్వయంగా లేదా ఇతరుల ద్వారా నిర్వర్తించవచ్చు. ఆర్టికల్ 75(1) ప్రధాన మంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 76 అటార్నీ జనరల్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.
సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు.
ప్రతీ రాష్ట్రానికి ఒక గవర్నర్‌ను రాష్ట్రపతి నియామకం చేస్తారు.
యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్థిక సంఘంను రాష్ట్రపతి నియమిస్తారు.
ఎన్నికల సంఘం చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఆర్టికల్ 148 ప్రకారం కాగ్‌ను నియమిస్తారు.
నేషనల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
అధికార భాషా సంఘాన్ని రాష్ట్రపతి నియామకం చేస్తారు.
రాజ్యాంగ బద్ద సంస్థల చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు.
రాష్ట్రపతి చేసే నియామకాలు
ఆర్టికల్ 148 ప్రకారం కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్
ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం
ఆర్టికల్ 316 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం
ఆర్టికల్ 338 నేషనల్ ఎస్సీ కమిషన్
ఆర్టికల్ 338A నేషనల్ ఎస్టీ కమిషన్
నోట్: కాగ్, ఆరిక సంఘం, యూపిఎస్సీ, నేషనల్ ఎసీ,ఎస్టీ కమిషన్‌లు తమ రిపోర్టును రాష్ట్రపతికి సమర్పిస్తారు.
రాష్ట్రపతి వాటిని పార్లమెంట్ ముందు ఉంచుతారు.
పార్టీ ఫిరాయింపు చట్టం
ఒక పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థి మరొక పార్టీలోకి మారితే పార్టీ ఫిరాయింపు చట్టం వర్తిస్తుంది.
అయితే సభా అధ్యక్షులు సభ్యత్వం రద్దు చేయకుండా వాయిదా వేస్తున్నారు.
ఈ చట్టాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1985లో 52వ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో చేర్చారు.
సభ్యత్వం రద్దు అయ్యే సందర్భాలు
ఎన్నికల సంఘం సిఫార్సుపై రాష్ట్రపతి సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు.
ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడితే హైకోర్టు చెల్లదని తీర్పు చెప్పినప్పుడు
సభకు అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సభకు హాజరు కాకపోతే రద్దువుతుంది. ద్వంద సభ్యత్వం కలిగి ఉంటే ఒక సభ్యత్వం రద్దవుతుంది.
ఆర్టికల్ 331 ప్రకారం లోక్‌సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్‌ను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు.
ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభకు 12 మంది నిష్ణాతులను కళలు, సాహిత్యం, సైన్స్, సమాజ సేవ రంగాలలో నామినేట్ చేస్తాడు.
సభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఒకే సారి ఖాళీ అయితే రాష్ట్రపతి సభా అధ్యక్షుడిగా ఒకరిని నియమిస్తాడు.
ప్రోటెం స్పీకర్‌ను నియమించేది రాష్ట్రపతి.
ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు.
ఈ ఆర్టినెన్స్ ను రాష్ట్రపతి కేంద్ర సలహా మేరకు జారీ చేస్తారు.
సలహాని రాష్ట్రపతి ఒకసారి వెనక్కి పంపవచ్చు. రెండోసారి అదే సలహాను తిరిగి ఇస్తే ఖచ్చితంగా ఆమోదించాలి.
ఈ ఆర్డినెన్స్‌ని పార్లమెంట్ తిరిగి సమావేశమైన తర్వాత 6 వారాలలోపు ఆమోదించాల్సి ఉంటుంది.
ఆమోదిస్తే ఆ ఆర్డినెన్స్ కొనసాగుతుంది. ఆమోదించకపోతే ఆర్డినెన్స్ రద్దువుతుంది.
ఆర్డినెన్స్ జీవితకాలం 6 నెలల 6 వారాలు లేదా పార్లమెంట్ సమావేశాల తర్వాత 6 వారాలు లేదా ఏడున్నర నెలలు.
ఆర్డినెన్స్ సాధారణ చట్టంలా చలామణి అవుతుంది. కాని దీనికి కాలపరిమితి ఉంటుంది.
రాష్ట్రపతి ఒక బిల్లును ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, పున:పరిశీలనకు పంపవచ్చు, నొక్కిపెట్టవచ్చు.
ఒక బిల్లును ఉభయసభలు ఆమోదించినప్పుడు రాష్ట్రపతి తిరస్కరించవచ్చు.
అప్పుడు బిల్లు రద్దవుతుంది. ఈ అధికారాలను అబ్జల్యూట్ వీటో అని అంటారు.
ఇంతవరకు ఏ రాష్ట్రపతి ఉపయోగించలేదు.
పునఃపరిశీలన
ఉభయ సభలు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఒకసారి పునఃపరిశీలన లేదా సవరణలు చేయవచ్చు.
రెండోసారి అదే బిల్లును ఉభయ సభలు ఆమోదించకపోతే రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి.
దీనిని 44వ సవరణద్వారా రాజ్యాంగంలో చేర్చారు. దీనిని సస్పెన్సీవ్ వీటో అని అంటారు. సస్పెన్సీవ్ వీటోని వాడిన రాష్ట్రపతి అబ్దుల్ కలామ్.
అంశం: లాభదాయక పదవుల బిల్లు.
నోట్: లాభదాయక పదువుల ద్వారా సభ్యత్వం (mp) కోల్పోయిన ఏకైక వ్యక్తి జయబచ్చన్
పాకెట్ వీటో
ఉభయ సభలు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఎంతకాలమైన నిర్ణయం తెలుపకుండా ఉండవచ్చు.
ఈ అధికారంను పాకెట్ వీటో అంటారు.
పాకెట్ వీటో వాడిన రాష్ట్రపతి జైల్‌సింగ్.
అంశం: పోస్టల్ బిల్లు
వీటో చేయలేని బిల్లులు
ఆర్థిక బిల్లు
రాజ్యాంగ సవరణ బిల్లు
కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు
ఉభయ సభలు రెండో సారి ఆమోదించి పంపిన బిల్లులు.
న్యాయపరమైన అధికారాలు
శిక్ష తగ్గింపు, మార్పు, రద్దు చేయగలరు.
మరణశిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సైనిక కోర్టులు విదించే శిక్షల మార్పులు చేస్తారు.
కేంద్ర చట్టాలు ఉల్లంఘించడంలో శిక్ష పడితే శిక్షలను మార్పు చేసే అధికారం ఉంటుంది. ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
కేంద్ర అఘంతక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. దీనిలో ఉన్న డబ్బు ఖర్చుకి పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు.
సాధారణంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు ఖర్చు చేస్తారు.
కేంద్ర సంఘటిత నిధి : దీనిపై రాష్ట్రపతికి అధికారం ఉండదు. పార్లమెంట్ అనుమతితోనే ఖర్చు చేస్తారు.