Friday, December 20, 2024

ముగ్గుల పోటీలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Dayakar Rao started Muggulu competition

హైదరాబాద్: 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవం ద్విసప్తాహ వేడుకలలో భాగంగా శనివారం వరంగల్ మహా నగరపాలక సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ప్రారంభించారు. తర్వాత మహిళలతో కలిసి ముగ్గు వేసి రంగులద్దారు. అనంతరం విజేతలకు అవార్డులు అందజేశారు. స్థానికంగా రూ.10.20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన అశోకస్థూపాన్ని మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ సారయ్య,ఎమ్మెల్యే నరేందర్, కమిషనర్ ప్రావిణ్య, డెప్యూటీ మేయర్ శ్రీమతి రీజ్వాన శమిమ్ మసూద్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News