నల్గొండ: నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది అని సిఎం ప్రశ్నించారు. మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్నారు. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని సిఎం ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఏవీ మనకు రాలేదని తెలిపారు. కృష్ణా జిల్లాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే 8 ఏళ్లగా తేల్చడం లేదని కెసిఆర్ ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో మీకు వాటా ఇచ్చేది లేదని చెప్పేందుకు అమిత్ షా వస్తున్నారా? తెలంగాణ ప్రజలకు పోరాటటం కొత్త కాదు, సాధించేవరకు పోరాడుతూనే ఉంటామన్నారు. కృష్ణా జాలాల్లో వాటా గురించి బిజెపి నేతలు మోడీ, అమిత్ షాను ఎప్పుడైనా అడిగారా? అని కెసిఆర్ డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి రేపు మునుగోడుతో చెప్పాలని అమిత్ షాను డిమాండ్ చేస్తున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. బిజెపి 8ఏళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా అని కెసిఆర్ ప్రశ్నించారు.
రేపు అమిత్ షా సమాధానం చెప్పాలి: సిఎం కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -