తైపే : చైనా యుద్ధానికి కాలు దువ్వుతున్నా తైవాన్ మాత్రం చైనా జీవాయుధ పోరాట భయంతో అందుకు సిద్ధం కావడం లేదు. తైవాన్-చైనా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాత్రికేయులు తైవాన్‌లో పర్యటించాలని కాంక్షిస్తున్నారు. అయితే ఈ పర్యటన అంతసులువు కాదు. అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. యుద్ధ కాంక్షతో తైవాన్ చుట్టూ సైనిక కార్యకలాపాలను విస్తరించిన చైనాతోనే కాదు, జీవాయుధ పోరాటాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తైవాన్‌లో పర్యటనకు అంతా సిద్ధం చేసుకున్నా ఈ ప్రక్రియ మాత్రం దుర్భరం అని కొంతమంది పాత్రికేయులు పేర్కొన్నారు. వీసాకు దరఖాస్తు చేయాలి. తైపే నుంచి అభ్యర్థన అంగీకారం కోసం నిరీక్షించాలి.
ఒకసారి క్లియరెస్సు వస్తే తైవాన్‌లో నిర్దేశించిన క్యారంటైన్ హోటల్‌లో మూడు రోజులు తప్పనిసరిగా నిబంధనల మేరకు ఉండాలి. యావత్ ప్రపంచం కొవిడ్ ఆంక్షలను సడలించగా, తైవాన్ మాత్రం ఎందుకు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది ? చైనా జీవాయుధ పోరాటంలో నిమగ్నం కావడమేనని తైవాన్ భయపడుతోంది. బ్యాక్టీరియా బాంబులను కూడా చైనా సిద్ధ ంచేసినట్టు వార్తలు వస్తున్నాయి. విమానాశ్రయానికి నేను చేరుకున్న తరువాత ఆర్‌టిపిసిఆర్ నెటిటివ్ రిపోర్టు కావాలని అడిగారు. దాన్ని ఆన్‌లైన్‌లో అర్పించాలి. ఆ ఫారంలో కాంటాక్టు వివరాలన్నీ నింపాలి. క్వారంటైన్ హోటల్ పేరు సూచించాలి. ఈ ప్రక్రియ ఎంతో దుర్భరం అని జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు.