Saturday, December 21, 2024

తాగండి తాగించండి

- Advertisement -
- Advertisement -

Japan urges its young people to drink more

యువతకు జపాన్ అధికారిక పిలుపు

టోక్యో : జపాన్‌లో అధికార యంత్రాంగం యువతను మందుకొట్టండి బాబూ అని ప్రోత్సహిస్తోంది. దీనికోసం ఏకంగా ఓ ప్రచార చైతన్య కార్యక్రమాన్ని ‘సేక్ వివా’ పేరిట ఆరంభించింది. దేశంలోని యువత సాధ్యమైనంత ఎక్కువగా ఆల్కహాల్ పానీయాలు తీసుకోవాలని , అంతేకాకుండా ఈ డ్రింక్సు మరింతగా అమ్ముడుపొయ్యేందుకు అవసరం అయిన వినూత్న స్కీంలు , ఆలోచనలు అందించాలని, నచ్చితే వీటిని అందించిన వారికి తగు పారితోషికాలు ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రకటించారు. కొవిడ్ తరువాత లాక్‌డౌన్ వంటి పరిణామాలతో వసూళ్లు తగ్గి ఆదాయం పడిపోవడంతో జపాన్‌లో ఆల్కహాల్ సేవనం కోసం అధికారులు ఉద్యమించారు. స్టామినా ఎక్కువగా ఉండే యువతను కేంద్రీకృతం చేసుకుని వారు ఆల్కహాల్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జాతీయ పన్నుల సంస్థ (ఎన్‌టిఎ) ఇటీవలే జాతీయ బిజినెస్ కాంటెస్టును సేక్ వివా పేరిట ఆరంభించింది.

ఆలోచనలు ఇవ్వండి, డ్రింక్‌ల అమ్మకాలు పెంచండి జపానీ హాట్‌డ్రింక్స్ సేక్, షోచూ , అవమోరీ, బీర్,విస్కీ, వైన్‌లను ఎక్కువగా తీసుకోండి, జపాన్ ఆదాయం పెంచండని నినాదాలతో ప్రచారానికి ఏకంగా పన్నుల అధికారిక సంస్థనే రంగంలోకి దిగింది. ప్రధానంగా లిక్కర్ పరిశ్రమ పటిష్టత, ఆర్థిక సమస్యల పరిష్కారానికి తాము వ్యూహరచనకు దిగినట్లు యువతను ఇందులో కీలక పాత్రధారులను చేయనున్నట్లు పన్నుల సంస్థ తెలిపింది. సేక్ వివా పథకంలో భాగంగా దేశంలోని 20 నుంచి 39 ఏండ్లలోపు వారు మందు తీసుకునే ఆలోచనలు పెంచడం, అమ్మకాలు పెంచడం, ఆదాయ వనరులు పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఈ విధంగా ముందుకు దూసుకుపొయ్యే వారికి ప్రభుత్వం తరఫున దండిగా సాయం ప్రోత్సాహకాలు ఉంటాయని కూడా తెలిపారు.

ఆదాయ వనరుల ప్రోత్సాహానికి తలపెట్టిన స్కీంలో పాల్గొనే వారికి ఎటువంటి రుసుం భారం ఉండదు. వారు ఇప్పటి నుంచే తమ ఆలోచనలను ప్రభుత్వానికి పంపించవచ్చు. ఆదాయ వనరులు పెంచేందుకు ప్రత్యేకించి యువత ఎక్కువగా ఆల్కహాల్ పానీయాలు తీసుకునేందుకు వీలైన ఆకర్షణీయ చిట్కాలు అందించిన వారిని వడబోసి విజేతల పేర్లను నవంబర్ 10వ తేదీన ప్రకటిస్తారని పన్నుల సంస్థ తెలిపింది. కొవిడ్ కారణంగా జపాన్‌ఓ 2020లో జనం తక్కువగా తాగుతూ వస్తున్నారని డాటాతో వెల్లడైందని ఎన్‌టిఎ తెలిపింది. 1995లో జనం సగటున 100 లీటర్ల ఆల్కహాలు తీసుకునేవారు. ఇప్పుడు ఇది 75 లీటర్ల స్థాయికి దిగజారిందని పన్నుల సంస్థ ఎన్‌టిఎ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News