Monday, December 23, 2024

మొబైల్ ఫోన్ డిస్‌ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం

- Advertisement -
- Advertisement -

15% customs duty on import of mobile phone displays

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ డిస్‌ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం (బిసిడి) సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్‌స్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి)తెలిపింది. మొబైల్ ఫోన్‌ల డిస్‌ప్లేలపై 10శాతం కస్టమ్స్ సుంకం ఉండగా, డిస్‌ప్లే అసెంబ్లీ తయారీకి ప్రత్యేకంగా విడిభాగాల దిగుమతులపై సుంకం లేదు. సెల్‌ఫోన్ టచ్‌ప్యానెల్, కవర్‌గ్లాస్, ఎల్‌ఇడి డిస్‌ప్లే బ్రైట్‌నెస్ పెంచే ఫిల్మ్ రెండరింగ్ కోసం ప్రత్యేకంగా ఉంటాయి. ట్రే, యాంటెన్నా పిన్, పవర్ కీ, స్లైడర్ స్విచ్, బ్యాటరీ కంపార్ట్‌మెంట్, వాల్యూమ్, పవర్, సెన్సార్లు తదితరాలకు ఫెకిబుల్‌ప్రింటెడ్ సర్కూట్ (ఎఫ్‌పిసి) వంటి ఇతర వస్తువులు డిస్‌ప్లేతోపాటు సుంకాన్ని వసూలు చేస్తారు. ఈ సర్కూలర్‌తో మొబైల్ ఫోన్ తయారీదారులకు, ఇండస్ట్రీకి ఉపశమనం కలిగిస్తుందని, అనవసర వివాదాలు లేకుండాకస్టమ్స్ సుంకాలపై స్పష్టతనిస్తుందని ఇండియా సెల్యూలర్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ పంకజ్ మొహింద్రు తెలిపారు. కాగా జులైలో డైరెక్టరేట్ ఆఫ్‌రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పోకు నోటీసులు జారీ చేసింది. కస్టమ్స్ సుంకాలను ఎగవేశారని ఆరోపించింది. అనంతరం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ మూడు భారతీయ స్మార్ట్‌ఫోన్ కూడా జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News