సెప్టెంబర్ 20 నాటికల్లా కొత్త
అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది
పార్టీ ఎన్నికల అథారిటీ చీఫ్
మధుసూదన్ మిస్త్రీ స్పష్టీకరణ
పార్టీకి గాంధీయేతర
అధ్యక్షుడు ఖాయమా?
రేసులో ముందున్న అశోక్ గెహ్లాట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుందని, సెప్టెంబర్ 20 నాటికి కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలనే షెడ్యూల్‌కు తాము కట్టుబడి ఉన్నామని పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ ఆదివారం పిటిఐకి చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు తుది తేదీని ఎన్నిక ఖరారు చేసే బాధ్యత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని , ఆగస్గు 21నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఎప్పుడయినా అది ఉండవచ్చని ఆయన చెప్పారు. దీనితో ఆదివారంనుంచి అధ్యక్ష ఎన్నిక షెడ్యూ ల్ ప్రారంభమయినట్లయింది. కాగా సిడబ్లుసి సమావేశం వచ్చేవారం జరగవచ్చని తెలుస్తోంది. బ్లాక్ కమిటీ లు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యలు ఎన్నిక 2022 ఏప్రిల్ 16నుంచి మే 31 మధ్య పూర్తి కావాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సిడబ్లుసి) నిర్ణయించింది. అలాగే జిల్లా కమిటీ అధ్యక్షులు, కార్యవర్గం ఎన్నికలు జూన్ 1నుంచి జులై 20 మధ్య పూర్తి చేయాలని, పిసిసి అధ్యక్షులు, ఎఐసిసి సభ్యు ల ఎన్నిక జులై20నుంచి ఆగస్టు 20 మధ్య, ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఎఐసిసి అద్యక్ష ఎన్నిక పూర్తి కావాలని సిడబ్లుసి నిర్ణయించింది.‘ ఈ షెడ్యూల్‌కు మే ము కట్టుబడి ఉంటాం. పార్టీ నాయకత్వానికి ఎన్నికల షె డ్యూల్‌ను మేము ఇప్పటికే పంపించాం.
కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు తుది తేదీలను ఖరారు చేసే సిడబ్లుసి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం’ అని మిస్త్రీ చెప్పారు. బ్లాక్, జిల్లా పిసిసి స్థాయిలోసంస్థాగత ఎన్నికలప్రక్రియ పూర్తయిందా అని అడగ్గా ఆ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని మిస్త్రీ చెప్పారు. అయితే కీలక పార్టీ అధ్యక్ష ఎన్నికలో ఓటు వేసే ఎఐసిసి ప్రతినిధులను ఖరారు చేసే ప్రక్రియలో ఎన్నికల అథారిటీ ఉందని చెప్పారు. పార్టీ అధ్యక్షు డి ఎన్నికకు తుది తేదీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖరారు చేస్తుందని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 20 నాటికల్లా పా ర్టీకి కొత్త అధ్యక్షుడు ఉంటారని సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా చెప్తూ ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, మరోసారి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖంగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో పార్టీకి గాంధీయేతర అధ్యక్షుడు రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు లిపారు. అయితే ప్రస్తుతానికి ఆ పదవిని ఎవరు చేపడతారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. కాంగ్రెస్ పార్టీ వర్గాలనుటంకిస్తూ జాతీయ మీడియా కథనాల ప్రకారం రాహుల్ గాంధీని ఒప్పించడానికి పలువురు నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఆదివారం( ఆగస్టు 21)నుంచి అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావలసి ఉంది. అయితే ఇప్పటికీ పార్టీలో అనిశ్చితి కొనసాగుతోంది. రా హుల్ గాంధీ తిరిగి అధ్యక్ష బాధ్యతలను చేపట్టడానికి సు ముఖంగా లేనప్పటికీ పార్టీలో చాలామంది నేతలు మా త్రం ఆయనే పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారు.
ఒక వేళ అది వీలుకాని పక్షంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పరిశీలనలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు ముం దు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కాంగ్రె స్ ప్రధాన కార్యదర్శి ముకుల్‌వాస్నిక్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష ప దవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనే అ ధ్యక్షుడుడిగా కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోరినప్పటికీ ఆయన ససేమిరా అనడంతో సోనియాగాంధీ తా త్కాలిక అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కోరుతూ జి23గా పిలవబడే పార్టీ లోని అసంతృప్త నేతలు సోనియా గాంధీకి లేఖ రాసే వరకు అధ్యక్ష ఎన్నికలపై పార్టీలో ఎలాంటి కదలిక లేదు. గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మలాంటి పలువురు సీనియర్ నేతలు ఆ గ్రూపులో ఉన్నారు. ఆ లేఖ దరిమిలా పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి తాత్కాలిక షెడ్యూల్‌ను సిడబ్లుసి గత ఏడాది అక్టోబర్‌లో ఆమోదించింది.