Thursday, December 19, 2024

చిరంజీవికి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan extends birthday wishes to Chiranjeevi

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఈరోజు 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రియతమ సోదరుడికి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.” నా ప్రియమైన సోదరుడు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను గౌరవించే, ఆరాధించేే సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యం, విజయం చేకూరాలని కోరుకుంటున్నా. అన్యయ్య… తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా గొప్ప అనుభూతి కలుగుతుంది. చిరంజీవి జీవితం తెరిచిన పుస్తకం. చెమటోడ్చి సంపాదించిన సొమ్ము నుంచి ఎందరికో సాయం చేశారు. అన్నిటికన్నా మిన్న ఆయనలోని ఒదిగుండే లక్షణం. ప్రతి నమస్కారం చేయని కుసంస్కారి అయినా నమస్కరించే సంస్కారం చిరంజీవిది. అలాంటి అన్నయ్యకు తమ్ముణ్ణి కావడం పూర్వజన్మ సుకృతం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభిమానులు, కుటుంబసభ్యులు, సెలబ్రిటీలు చిరుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News