Sunday, September 8, 2024

ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రధాన ట్రస్టీగా దమానీ

- Advertisement -
- Advertisement -

Damani as Principal Trustee of Jhunjhunwala Investments

న్యూఢిల్లీ : వారం రోజుల క్రితం కన్నుమూసిన దిగ్గజ ఇన్వెస్టర్ ఝన్‌ఝున్‌వాలాకు చెందిన ఆస్తుల ప్రధాన ట్రస్టీగా ప్రముఖ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ ఉండనున్నారు. రాధాకిషన్‌ను రాకేష్ తన గురువుగా భావిస్తానని చాలా సందర్భాల్లో చెప్పారు. రాధాకిషన్ దమానీ రాకేష్ ఝున్‌జున్‌వాలా ట్రస్ట్‌కి చీఫ్ ట్రస్టీగా నియమితులయ్యారు. దమానీ ఇకపై ఝున్‌ఝున్‌వాలా సంపదను చూసుకోనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు, బిగ్‌బుల్‌కు స్నేహితులు అయిన కల్‌ప్రజ్ ధరంషి, అమల్ పారిఖ్‌లు ట్రస్టీలుగా ఉంటారు. రాధాకిషన్ దమానీ స్టాక్ మార్కెట్ అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులలో ఒకరు. అవెన్యూ సూపర్‌మారట్స్ అతని రిటైల్ కంపెనీ, ఇది డి మార్ట్ స్టోర్స్ పేరుతో రిటైల్ చైన్‌ను నడుపుతోంది. అవెన్యూ సూపర్‌మారట్స్‌లో రాధాకిషన్ దమానీ హోల్డింగ్ దాదాపు రూ.1.80 లక్షల కోట్లు ఉన్నాయి. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆగస్టు 14న మరణించారు.

ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన ఆస్తిని చూసుకోవడానికి ట్రస్టీని నియమించాలని ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడు. రాకేష్ అనేక లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. ఆయన కంపెనీ రేర్ ఎంటర్‌ప్రైజెస్‌ని ఇద్దరు విశ్వసనీయులైన ఉత్పల్ సేథ్, అమిత్ గోయ్లా నిర్వహిస్తారు. ఫోర్బ్ ప్రకారం, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సంపద 5.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన భారతదేశంలో 48వ అత్యంత సంపన్న వ్యక్తి, స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల్లో ఆయన పెట్టుబడి దాదాపు రూ.30,000 కోట్లు ఉంది. దీనిలో టైటాన్ రూ.10,945 కోట్లు, స్టార్ హెల్త్ రూ.7,056 కోట్లు, మెట్రో బ్రాండ్ రూ.3,166 కోట్లు, టాటా మోటార్స్ రూ.1,707 కోట్లు, క్రిసిల్ విలువ రూ.1,308 కోట్లు. ఇది కాకుండా ఆయన ఆకాశ ఎయిర్, ఇంకా అనేక అన్‌లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News