- Advertisement -
‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నరేష్, తమిళ నటుడు ప్రభు, నవీన్ చంద్ర, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది.
Ranga Ranga Vaibhavanga Trailer Released
- Advertisement -