- Advertisement -
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ ఎట్టకేలకు రాష్ట్రపతిని కలిశారు. ఈమేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ముని కలిసి అభినందించారు. ఇటీవల సోనియా గాంధీ రెండుసార్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో అట్టుడికిపోతోంది. ఇటీవలే కాంగ్రెసన్ సీనియర్ నాయకుడు ఆనంద్‌శర్మ ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనను పదేపదే అవమానించడంతో రాజీనామా చేయక తప్పలేదని వాపోయారు. దీంతో ఆయనను శాంతింన చేయడానికి హిమాచల్ ప్రదేశ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ శుక్లాని పంపారు. ఆ తర్వాత ఆయన రాజీవ్‌శర్మను కలిసి మాట్లాడిన అనంతరం సోనియాను కలిసేందుకు ఢిల్లీ పయనమయ్యారు.
Sonia Gandhi Meets President Murmu
- Advertisement -