Friday, December 20, 2024

శివసేన గుర్తుపై నిర్ణయం వద్దు… ఈసీకి సుప్రీం ఆదేశం

- Advertisement -
- Advertisement -

శివసేన గుర్తుపై నిర్ణయం వద్దు… ఈసీకి సుప్రీం ఆదేశం
షిండే, థాక్రే వర్గం పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ
న్యూఢిల్లీ : శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ వ్యవహారంపై మొత్తం 8 ప్రశ్నలను రూపొందించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం దీనిపై విచారణ జరిపి తీర్పు వెలువరించనున్నది. గురువారం వరకు శివసేన ఎన్నికల గుర్తు (విల్లు, బాణం)ను ఎవరికి కేటాయించాలనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు సూచించింది. శివసేన పార్టీ తమదే అని ఉద్ధవ్, షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారిస్తోంది. వీటిపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ షిండే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీన్ని థాక్రే వర్గం వ్యతిరేకించింది. సుప్రీంలో విచారణ పూర్తికానందున షిండే వినతిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని విజ్ణప్తి చేసింది. ఈ నేపథ్యం లోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కీలక నిర్ణయం తీసుకొంది. దీంతో విల్లంబుల గుర్తు తమదేనని రుజువు చేసే పత్రాలను సమర్పించాలని షిండే, థాక్రే వర్గాలకు ఈసీ సూచించింది. శివసేన శాసనసభా పక్షంతోపాటు పార్టీ సంస్థాగత విభాగ సభ్యుల మద్దతు లేఖలను కూడా ఇవ్వాలని రెండు వర్గాలను కోరింది. దీంతో థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

SC directs EC not to pass orders on Shiv Sena Symbol

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News