Tuesday, December 24, 2024

నాగార్జున సాగర్ డ్యామ్ పై తెలుగు రాష్ట్రాల పోలీసుల వివాదం..

- Advertisement -
- Advertisement -

AP Telangana police searched on Nagarjuna sagar dam

నల్లగొండ: నాగార్జున సాగర్ లో రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సాగర్ డ్యామ్ పై ఎపి సివిల్ పోలీసులు, టిఎస్ ఎస్ పిఎఫ్ పోలీసుల మధ్య వివాదం చెలరేగింది. డ్యామ్ పైకి ఎపికి చెందిన ఎస్ఐ వాహనాన్ని  టిఎస్ ఎస్ పిఎఫ్ సిబ్బంది అనుమతించలేదు. ఎపి పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ఎస్ పిఎఫ్ సిబ్బంది వాహనాలకు ఎపి సివిల్ పోలీసులు చలానా విధించారు. ఇరువురి పంతాలతో వివాదం ముదిరింది. పోలీసుల పంచాయితీ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. విషయం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు రాజీ కుదురుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News