Monday, December 23, 2024

‘మహా’ విధానసభ మెట్ల మీదే దూషణ పర్వం..

- Advertisement -
- Advertisement -

ముంబై: నగరంలోని విధాన్ భవనం వద్ద బుధవారం అధికార శివసేన ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష సభ్యులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన ఎమ్మెల్యేలను విధాన్ భవన్ మెట్ల మీద నిలుచుని ప్రతిపక్ష ఎన్‌సిపి ఎమ్మెల్యేలు క్యారెట్లు చూపుతూ ఎగతాళి చేయడంతో పరస్పర దూషణలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఎన్‌సిపి ఎమ్మెల్యేల చేతుల్లో నుంచి క్యారెట్లను లాక్కోవడానికి శివసేన ఎమ్మెల్యేలు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. దీంతో రెండు పక్షాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. కొద్దిసేపు పరస్పరం నినాదాలు చేసుకున్న ఇరుపక్షాల సభ్యులు అనంతరం శాసనసభా సమావేశాలలో పాల్గొనేందుకు లోపలకు వెళ్లారు. గురువారంతో రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి.

Shinde faction and Opposition shout slogans each other

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News