51 శాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం
ప్రయత్నాలు వేగవంతం చేసిన ప్రభుత్వం
సెప్టెంబర్‌లో విక్రయించే అవకాశం
న్యూఢిల్లీ: ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ ను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రభుత్వరంగ ఐడిబిఐ బ్యాంక్‌లో 51 శాతం వాటను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభు త్వం, ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఈ రెండింటికి ఐడిబిఐ బ్యాంకులో 94 శాతం వా టాలున్నాయి. వీటిలో ఎంత వాటాను విక్రయించాలని అంశంపై అధికారులు చర్చిస్తున్నట్టు స మాచారం. మీడియా నివేదికల ప్రకారం, ఐడిబిఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే మంత్రు ల బృందం తుది నిర్ణయం తీసుకోనుంది. సెప్టెంబర్ చివరి నాటికి ఐడిబిఐ బ్యాంక్‌పై ప్రభు త్వం నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.
ఐడిబిఐ బ్యాంకులో ప్రభుత్వ వాటా 45.48 శాతం, ఎల్‌ఐసి వాటా 49.24 శాతం ఉన్నాయి. ఐడిబిఐ బ్యాంక్‌లో ప్రభుత్వం కొంత వాటా, ఎల్‌ఐసి కొం త వాటాను విక్రయిస్తుందని తెలుస్తోంది. ఇక ని ర్వహణ నియంత్రణతో పాటు కొనుగోలుదారుకు యాజమాన్య బాధ్యత అప్పగించవచ్చని భావిస్తున్నారు. 40 శాతం కంటే ఎక్కువ వాటా కొనుగోలుకు ఆర్‌బిఐ ఆమోదం తెలుపుతుంది. వాటా వి క్రయం వార్తల తర్వాత ఐడిబిఐ బ్యాంక్ షేరు పెరుగుదలను చూస్తోంది. ఐడిబిఐ బ్యాంక్‌లో బ్యాంక్ షేర్ 2.56 శాతం పెరిగి రూ.40 వద్ద కనిపించింది. ఆఖరికి 2.31 శాతం లాభంతో 39.90 వద్ద ముగిసింది. బ్యాంకుల యాజమాన్యం, బ్యాంకింగ్ రంగ నియంత్రణకు సంబంధించి ఆర్‌బిఐ పాత్ర తటస్థంగా ఉందని ఇటీవల ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బ్యాం కుల యజమానులు తమ వద్ద ఎంత వాటా ఉం చుకోవాలనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయనన్నారు. బ్యాంకుల యాజమాన్యానికి సం బంధించి ఆర్‌బిఐ పాత్ర తటస్థంగా ఉంది.
ఒడిదుడుకుల్లో మార్కెట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. ఆఖరికి స్వల్ప లాభాల తో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు పుంజుకోవ డం, అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ స్పంద న వెరసి భారతీయ ఈక్విటీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య లాభాలను నమోదు చేశాయి. మార్కె ట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 54 పాయింట్లు పె రిగి 59,085 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 27.45 పాయింట్ల లాభంతో 17,604 పా యింట్ల వద్ద స్థిరపడింది. ఆటో, ఫార్మా కన్జ్యూమ ర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు క్షీ ణించాయి. అదే సమయంలో బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి, ఎనర్జీ, మెటల్స్, ఇన్‌ఫ్రా, మీడియా రంగ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీలోని 50 షేర్లలో 28 షేర్లు లాభపడగా, 22 షేర్లు న ష్టా ల్లో ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 16 స్టాక్‌లు లాభాలతో ముగియగా, 14 రెడ్ మార్క్ లో ముగిశాయి. ప్రధానంగా ఇండస్‌ఇండ్ బ్యాం క్ 3.08 శాతం, ఎన్‌టిపిసి 1.55 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 1.12 శాతం, లార్సెన్ 0.92 శాతం, పవర్ గ్రిడ్ 0.88 శాతం లాభపడ్డాయి.