Monday, December 23, 2024

‘వర్క్ ఫ్రమ్ హోం’కు చెక్ పెట్టబోతున్న టిసిఎస్

- Advertisement -
- Advertisement -

 

TCS Office

హైదరాబాద్: ప్రముఖ టెక్ కంపెనీ టిసిఎస్  తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే నిమిత్తం కేటాయించిన ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. నవంబర్ నుంచి ఉద్యోగులంతా ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని  ఉద్యోగులకు స్పష్టం చేసింది. టిసిఎస్ ఉద్యోగుల్లో కొందరికి ఆ సంస్థ కొన్నేళ్లుగా ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో ఉద్యోగం చేసే అవకాశం ఇచ్చింది. కరోనా కారణంగా దాదాపుగా ఉద్యోగులందరికీ ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో ఇంటి నుంచే ఉద్యోగం చేసే వెసులుబాటు కల్పించింది.  కరోనా కాలం నుంచి టిసిఎస్ ఉద్యోగులంతా ఇళ్ల వద్ద ఉండే పనిచేస్తున్నారు.  ప్రస్తుతం పరిస్థితులు మారిపోవడం, కరోనా భయం తొలగిపోవడంతో నవంబర్ 15 నుంచి ఉద్యోగులంతా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని టిసిఎస్ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే నవంబర్ 15 లోపు మాత్రమే టిసిఎస్  ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశం ఉందనమాట. ప్రస్తుతం టిసిఎస్‌ ఉద్యోగుల్లో 20 నుంచి 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీస్‌కు వెళ్లి పనిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News