Monday, December 23, 2024

హయాత్‌ నగర్‌లో 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

8th class student commits suicide in Hayat Nagar

హైదరాబాద్: హయాత్‌నగర్‌లో ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హోం వర్క్‌ చేయకుండా, క్లాస్ లో అల్లరి చేసిందని కారణాలతో టీచర్‌ విద్యార్థిని (అక్షయ)ను తరగతి గది మోకాళ్ళపై నిల్చోబెట్టింది. తోటి విద్యార్ధుల ముందు మోకాళ్లపై నిల్చున్న అవమానంగా భావించిన అక్షయ తీవ్ర మనస్తాపానికి గురై ఇంటికెళ్లి ప్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తన కుతూర్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రస్తుతం పాఠశాల ముందు విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనకు దిగాయి. అక్షయ నగరంలోని హయత్ నగర్‌కు చెందిన అర్‌టిసి కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూల్‌లో చదువుతోంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News