- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 29 వరకు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు మరో ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికా రులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆగస్టు 29 వరకు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ చెప్పింది. 26, 29వ తేదీల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని, 27, 28వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
- Advertisement -