- Advertisement -
హైదరాబాద్: ఒక ప్రాణాన్ని కాపాడేందుకు తమ వృత్తి ధర్మంలో నైపుణ్యతను ప్రదర్శించి, రోగిని స్పృహలో ఉండేలా ఇష్టమైన సినిమాని గాంధీ వైద్యులు చూపించడాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన అరుదైన సర్జరీ అందరినీ ఆకట్టుకుందన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించడంతో ప్రభుత్వ వైద్యులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుందని హరీష్ రావు తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. యాదాద్రి భువనగిరికి చెందిన ఓ వ్యక్తికి మెదడులో కణతి ఉంది. గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ చేస్తుండగా ఆమె మెలుకువగా ఉండాలని తెలిపారు. రోగి తనకు చిరంజీవి అంటే అభిమానమని, ఆయన సినిమాలంటే ఇష్టమని చెప్పడంతో అడవి దొంగ సినిమా రోగి వీక్షిస్తుండగా ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారు. అతి త్వరలో ఆ రోగిని కలుస్తానని చిరంజీవి ట్వీట్ చేశాడు.
- Advertisement -