Saturday, December 21, 2024

ఇక కూల్‌సిటీగా మారనున్న విశ్వనగరం !

- Advertisement -
- Advertisement -

Hyderabad may soon get its first Wind Garden

సరికొత్త కాన్సెప్ట్‌తో ‘విండ్ గార్డెన్’ అందుబాటులోకి…
మంత్రి కెటిఆర్ చొరవ…హెచ్‌ఎండిఏ అధికారుల ప్రణాళికలు…
తగ్గనున్న 4 డిగ్రీల సెల్సియస్ ఉస్ణోగ్రతలు

హైదరాబాద్: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇకపై కూల్ సిటీగా మారనుంది. అందులో భాగంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ‘విండ్ గార్డెన్’ను అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీని ఏర్పాటుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చొరవ చూపడంతో హెచ్‌ఎండిఏ దీని ఏర్పాటుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ‘విండ్ గార్డెన్’ ప్రస్తుతం థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌తో పాటు స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లోనూ దీనిని నిర్మిస్తున్నారు. అయితే మన దగ్గర కూడా తొలిసారిగా సంజీవయ్య పార్కులో (లేదా) మరో అనువైన అర్భన్ పార్కులో ఏర్పాటుచేసేలా హెచ్‌ఎండిఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. హైదరాబాద్‌లోని అర్భన్ పార్కుల నిర్వహణను హెచ్‌ఎండిఏనే చూస్తున్న నేపథ్యంలో ‘విండ్ గార్డెన్’ ఏర్పాటు బాధ్యతలను కూడా ఆ సంస్థకే అప్పగించారు.

ఆ రెండు ప్రాంతాల నుంచి సమాచారం
మ్యాడ్రిడ్ అధికారులు షేర్ చేసిన ట్వీట్‌పై స్పందించిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, మంత్రి కెటిఆర్‌కు దానిని పోస్ట్ చేసి, హైదరాబాద్ పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు దానిని ట్యాగ్ చేశారు. విండ్ గార్డెన్‌ల వివరాలను సేకరించాలని, అనంతరం అలాంటి ఏర్పాట్ల కోసం హెచ్‌ఎండిఏ అర్భన్ పార్కులను పరిశీలించాలని ఆయన సూచించారు. దీనిపై పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వెంటనే రియాక్ట్ అయ్యారు. విండ్ గార్డెన్‌లు ఉన్న ఆ రెండు ప్రాంతాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నానని, హైదరాబాద్ చుట్టుపక్కల విండ్ గార్డెన్‌ను నిర్మిస్తామని ఆయన తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో, ఓపెన్ ప్లేసుల్లో దీనిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. విండ్ గార్డెన్ ద్వారా టెంపరేచర్లను దాదాపు 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించేందుకు మ్యాడ్రిడ్ అధికారులు కృషి చేస్తున్నారు. గార్డెన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం చల్లబడుతుంది. తద్వారా ఆ ప్రాంతాల్లో నివసించేవారు ముఖ్యంగా ఎండా కాలంలో ఉపశమనం పొందుతారు. విండ్ గార్డెన్ మోడల్ ప్రాజెక్టు అమలుకు సంజీవయ్య పార్కే తగినదని అర్వింద్‌కుమార్ పేర్కొంటున్నారు. హైదరాబాద్ మహా నగరం నడిబొడ్డున సువిశాలంగా పచ్చదనం పరుచుకొని ఉండటం, పక్కనే పెద్ద జలాశయం (హుస్సేన్‌సాగర్) ఉండటం అనుకూల అంశంగా ఆయన భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News