న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీల విధించడానికి ఇది సరైన సమయం కాదని కేంద్రం విశ్వసిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న డిజిటల్ పేమెంట్ విధానాన్ని వారు ఎంతో సులభంగా నిర్వహించగలుగుతున్నారు. దీంతో భారత ఆర్థికరంగం ఎంతో ఆకర్షణీయంగా తయారైంది. చెల్లింపుల విధానంలో పారదర్శకత మనం సాధించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల అన్నారు.ఈక్రమంలో డిజిటల్ పేమెంట్‌పై ఛార్జీలు విధించడం ఈ సమయంలో సరికాదని భావిస్తున్నాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్బీఐ తమ సిఫార్సులును ప్రస్తుతానికి తమవద్దనే ఉంచాలని ఆమె సూచించారు. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ట్రాన్సక్షన్స్‌పై ఛార్జీలు విధింపుపై ప్రజలు తమ స్పందన తెలియజేయాల్సిందిగా ఈనెల ఆర్బీఐ కోరింది. ఈనేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు వ్యాపార వర్గాలకు ఉపశమనం కలిగించాయి.
కాగా గతవారమే కేంద్రం యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించమని ప్రకటించింది. మరోవైపు ఆర్‌టిజిఎస్, ఎన్‌ఇఎఫ్‌టి పేమెంట్స్ సిస్టమ్స్‌ను భారత్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా నిర్వహిస్తోంది. అదేవిధంగా ఐఎంపిఎస్, రూపే, తదితర సిస్టమ్స్‌ను నేషనల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ ఏడాది జులై నాటికి అత్యధికంగా డిజిటల్ లావాదేవీలసంఖ్య 6.28బిలియన్‌కు చేరుకుంది. నేషనల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా చేసిన డేటా ప్రకారం ఈ లావాదేవీల విలువ రూ.10.62 ట్రిలియన్‌గా తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పట్లో డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీలు ఉండకపోవచ్చని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి.