దుబాయి: ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్ టీమ్ కళ్లు చెదిరే శుభారంభాన్ని అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ శ్రీలంక 19.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 10.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ కళ్లు చెదిరే శుభారంభం అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రహ్మానుల్లా 18 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో 3 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ హజ్రతుల్లా 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇబ్రాహీం జర్దాన్ (15) తనవంతు పాత్ర పోషించాడు. అంతకుముందు లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో అఫ్గాన్ బౌలర్లు సఫలమయ్యారు. ఫజల్ హక్ మూడు, ముజీబ్, నబి రెండేసి వికెట్లు తీశారు. లంక బ్యాటర్లలో రాజపక్స (38), కరుణరత్నె (31), గుణతిలక (17) మాత్రమే కాస్త రాణించారు.
Asia Cup 2022: AFG won by 8 wickets against SL