డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా కిచ్చా సమీపంలో భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో 37 మంది గాయపడ్డట్టు సమాచారం. శక్తి ఫారం ప్రాంతం లోని బాస్గర్ గ్రామానికి చెందిన దాదాపు 50 మంది భక్తులు సరిహద్దులో ఉన్న ఉత్తర ప్రదేశ్ ప్రాంతం లోని ఉత్తమ్‌నగర్‌లో ఉన్న గురుద్వారాకు పూజలు చేయడానికి ట్రాక్టర్‌లో బయలు దేరారు. ఉత్తమ్‌నగర్ గురుద్వారాలో ప్రతి ఆదివారం , గురు గ్రంథ సాహిబ్ పారాయణం, లంగర్ కార్యక్రమం జరుగుతుండగా, కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. సిర్సా అవుట్‌పోస్ట్ బరేలీ జిల్లా లోని బహేరీ పోలీస్ స్టేషన్ పరిధి లోకి వస్తుంది. అవుట్ పోస్ట్ సమీపంలో ట్రాక్టర్ రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించారనరి పేర్కొన్నారు.
గురుద్వారాకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -