Saturday, December 21, 2024

ప్రాచీన 86 బంగారు నాణేల చోరీ : 8 మంది కార్మికుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Theft of 86 ancient gold coins: 8 workers arrested

 

ధార్ : మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో పాత ఇంటి శిధిలాల తొలగింపులో దొరికిన 86 బంగారు నాణేలను కాజేసిన 8 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పురాతన చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ నాణేల విలువ దాదాపు రూ. 60 లక్షలు ఉంటుందని అధికారులు ఆదివారం తెలిపారు. కొన్ని రోజుల క్రితం పాత ఇంటి శిధిలాలు తొలగిస్తుండగా వీరికి 86 బంగారు నాణేలు దొరికాయని, అయితే వారు పోలీసులకు ఈ సమాచారం చెప్పకుండా తమలోతాము వాటిని పంచుకున్నారని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర పాటిదార్ తెలిపారు. ఈ 86 నాణేలు మొత్తం కిలో బరువు ఉంటుంది. వీటి విలువ రూ. 60 లక్షలుగా చెబుతున్నా, వాటి పురావస్తు ప్రాధాన్యత నిర్ధారించితే వాటి విలువ రూ. కోటికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News