- Advertisement -
పలువురు సీనియర్ల నమ్మకం
న్యూఢిల్లీ : త్వరలోనే రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవుతారని పార్టీ సీనియర్ నేత హరీష్ రావత్ తెలిపారు. పార్టీ పగ్గాలు తక్షణం చేపట్టాల్సిన బాధ్యత ఉందని పార్టీ కార్యకర్తలు నేతలు అంతా రాహుల్‌కు విజ్ఞప్తి చేస్తున్నారని, ఆయన దీనికి అనుగుణంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు రావత్ ఆదివారం తెలిపారు. పార్టీ క్లిష్టత పరిష్కారానికి రాహుల్ రావల్సి ఉంటుంది. ఆయన తప్పనిసరిగా బాధ్యతలు తీసుకుంటారని, ఇది కేవలం తన విశ్వాసమే కాకుండా పార్టీలో మెజార్టీ అభిప్రాయం అని తెలిపారు. పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకునేలా తాము రాహుల్ గాంధీని ఒప్పిస్తామని మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఆదివారం తెలిపారు. ఆయనే పార్టీ కీలక బాధ్యతలకు అన్ని విధాలుగా అర్హులని తాము భావిస్తున్నట్లు వివరించారు.
- Advertisement -