న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. ఆసియాకప్‌లో టోర్నీలో భాగంగా దుబాయ్‌లో ఉన్న భారతజట్టును ద్రవిడ్ ఆదివారం కలవనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ద్రవిడ్ స్థానంలో తాత్కాలిక కోచ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ తిరిగి బెంగళూరుకు వచ్చి ఇండియా ఎ జట్టు బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. కాగా ఆసియాకప్ వెళ్లేముందు జట్టుకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ద్రవిడ్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో మాజీ కెప్టెన్ ద్రవిడ్ ప్రయాణాన్ని విరమించుకోవగా బీసీసీఐ అతడి స్థానంలో జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ లక్షణ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించి దుబాయ్ పంపింది. వైద్యసిబ్బందిలో ఉన్న ద్రవిడ్ కరోనా నుంచి కోలుకోవడంతో తిరిగిజట్టులో చేరేందుకు మార్గం సుగమం అయింది. ఆసియాకప్‌లో భారతజట్టుకు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ మార్గనిర్దేశం చేయనున్నాడు.