అస్సాం సిఎం హిమంత ప్రతిపాదన
గువాహతి: దేశంలో ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి ప్రతి జోన్‌కు ఒకటి చొప్పున మొత్తం ఐదు జాతీయ రాజధానులను ఏర్పాటు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర ప్రతిపాదించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో మాటల యుద్ధాన్ని సాగిస్తున్న హిమంత సోమవారం వరుసగాఆ ట్వీట్లు చేస్తూ ఇతర రాష్ట్రాలను హేళనగా మాట్లాడడం కేజ్రీవాల్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. పేద రాష్ట్రాలను హేళన చేయడం మాని అసమానతలను రూపుమాపడానికి మనమంతా పనిచేద్దామని ఆయన సూచించారు. ప్రతి జోన్‌లో ఒకటి చొప్పున దేశానికి 5 రాజధానులు ఏర్పాటు చేసుకుందామా అని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల ఢిల్లీ లాంటి ప్రభుత్వాల వద్ద భారీ సంపద ఉండబోవని, ఈశాన్య, తూర్పు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో విద్య, ఆరోగ్య, సమాచార రంగాలలో గత 75 ఏళ్లలో ఎన్నడూ చూడనంత ప్రగతిని తమ రాష్ట్రాలు సాధిస్తున్నాయని హిమంత తెలిపారు.