Friday, December 20, 2024

ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Noted agri economist Abhijit Sen passed away

న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రముఖ ఆర్థిక వేత్త అభిజిత్ సేన్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. 72 సంవత్సరాల అభిజిత్ సేన్‌కు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అపారమైన నైపుణ్యముంది. రాత్రి 11 గంటలకు ఆయనకు గుండెపోటు రాగా వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించామని, మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారని అభిజిత్ సేన్ సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడిన తన వృత్తిపరమైన జీవితంలో ప్రొఫెసర్ అభిజిత్ కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలతోపాటు న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్ చైర్మన్‌తోసహా పలు ముఖ్యమైన ప్రభుత్వ పదవులను నిర్వహించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న కాలంలో ప్రణాళికా సంఘం సభ్యునిగా అభిజిత్ సేన్ ఉన్నారు. 2010లో ఆయనను పద్మభూషణ్ పురస్కారం వరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News