Friday, December 20, 2024

కశ్మీరులో 9.8 కి.మీ. సొరంగంలో రైల్వే లైను పూర్తి

- Advertisement -
- Advertisement -

9.8 km tunnel on Banihal-Katra railway link completed

జమ్మూ: నిర్మాణంలో ఉన్న జమ్మూ కశ్మీరులోని 111 కిలోమీటర్ల పొడవైన బనిహల్-కాట్రా రైలు మార్గంలో ఉన్న 9.8 కిలోమీటర్ల సొరంగం నిర్మాణం పూర్తి అయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైను(యుఎస్‌బిఆర్‌ఎల్)లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. భారతీయ రైల్వేలోనే అత్యంత పొడవైన 12.6 కిలోమీటర్ల సొరంగం టి-49బి ఈ ఏడాది జనవరిలో పూర్తి కాగా బనిహల్-కాట్రా రైల్వే మార్గంలోని సొరంగం ఈ మార్గంలో మూడవది. దుగ్గా, సవ్లాకోటె స్టేషన్ల మధ్య సొరంగం నిర్మాణం పనులు పూర్తయ్యాయని మంగళవారం అధికారులు తెలిపారు. యుఎస్‌బిఆర్‌ఎల్ ఒక జాతీయ ప్రాజెక్టని, నిర్ణీత కాలవ్యవధిలో దీని నిర్మాణం పూర్తి చేయాలన్నదే భారతీయ రైల్వేల లక్షమని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News