Wednesday, January 22, 2025

ప్రపంచంలో మూడో అత్యంత సంపన్నుడిగా అదానీ

- Advertisement -
- Advertisement -

Adani is the third richest person in the world

బెర్నార్డ్‌ను వెనక్కినెట్టిన భారతీయ వ్యాపారవేత్త
మూడో స్థానానికి చేరిన తొలి సంపన్నుడిగా పేరు

న్యూఢిల్లీ: గత కొన్నేళ్ల క్రితం గౌతమ్ అదానీ పేరును భారతదేశం బయట కొందరు విన్నారు. అయితే బొగ్గు రంగానికి వెళ్లడానికి ముందు కాలేజీతో చదువు ముగించిన భారతీయ వ్యాపారవేత్త అదానీ మొదటిసారి వజ్రాల వ్యాపారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా మారారు. ఒక ఆసియన్ తొలిసారిగా ప్రపంచంలో టాప్3 స్థానానికి వెళ్లారు. ఇంతకుముందు దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా వంటివారు కూడా ఇప్పటివరకు మూడో స్థానానికి వెళ్లలేదు. 137.4 బిలియన్ డాలర్ల నికర విలువతో అదానీ ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ అర్నాల్ట్‌ను వెనక్కినెట్టి ముందుకు వెళ్లారు. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ఇక అదానీకి ముందు స్థానాల్లో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు మాత్రమే ఉన్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా అదానీ(60) తన బొగ్గు నుంచి ఓడరేవుల వరకు వివిధ వ్యాపారాలను విస్తరించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత డేటా సెంటర్ల నుంచి సిమెంట్, మీడియా, అల్యూమినా వంటి రంగాల్లోకి కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచారు. గ్రూప్ ఇప్పుడు దేశంలోని ప్రైవేటురంగ పోర్ట్, ఎయిర్‌పోర్ట్ ఆఫరేటర్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్, కోల్ మైనర్ స్థాయికి వెళ్లింది. ఆస్ట్రేలియాలో ఆయన కంపెనీ చేపట్టిన ప్రాజెక్టు విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఆయన ముందుకు సాగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. ఎలాన్ మస్క్ 251 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ 153 బిలియన్ డాలర్లు ఒకటి రెండో స్థానాల్లో ఉండగా, ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.

బిలియనీర్ ర్యాంకింగ్ జాబితా

1.ఎలాన్ మస్క్ 251 బిలియన్ డాలర్లు

2.జెఫ్ బెజోస్ 153 బిలియన్ డాలర్లు

3.గౌతమ్ అదానీ 137 బిలియన్ డాలర్లు

4.బెర్నార్డ్ అర్నాల్ట్ 136 బిలియన్ డాలర్లు

5.బిల్ గేట్స్ 117 బిలియన్ డాలర్లు

6.వారెన్ బఫెట్ 100 బిలియన్ డాలర్లు

7.లారీ ఫేజ్ 100 బిలియన్ డాలర్లు

8.సర్గి బిన్ 95.8 బిలియన్ డాలర్లు

9.స్టీవ్ బాల్మర్ 93.7 బిలియన్ డాలర్లు

10.లారీ ఎలిసన్ 93.3 బిలియన్ డాలర్లు

11.ముకేశ్ అంబానీ 91.9 బిలియన్ డాలర్లు

12.కార్లోస్ స్లిమ్ 71.1 బిలియన్ డాలర్లు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News