Saturday, December 21, 2024

ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్‌, మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Governor and Minister Talasani visited Ganesha of Khairatabad

హైదరాబాద్‌: వినయకచవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ గణేశుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు. లంబోధరుడిని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకున్నారు. గణనాథుని తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అందరిని ఐకమత్యంగా ఉంచేదే గణేష్ ఉత్సవాలు అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అంతకుముందు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌, పలువురు ప్రముఖులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News