Monday, November 18, 2024

కొత్త జంటలు తగ్గడంపై చైనా ఆందోళన

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలో వివాహాలు చేసుకునే జంటల సంఖ్య గడచిన 36 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా నమోదైంది. 1986 తర్వాత మొట్ట మొదటిసారిగా 2021లో అతి తక్కువగా 80లక్షల కొత్త జంటలు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. దీనికి తోడు శిశు జననాల సంఖ్య తగ్గడం, జనాభా క్షీణించడం వంటి పరిణామాలు 2025 నాటికి దేశ పురోగతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించగలవని చైనా ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభా గల చైనాలో 2021లో కేవలం 76 లక్షల 40 వేల జంటలు మాత్రమే తమ వివాహాలను నమోదు చేసుకున్నాయి. 1986 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో వివాహ రిజిస్ట్రేషన్లు జరగడం ఇదే మొదటిసారని 2021లో పౌర వ్యవహారాల అభివృద్ధిపై తాజాగా వెలువడిన గణాంకాల నివేదిక పేర్కొంది. గత ఏడాది వివాహం చేసుకున్న జంటలలో 25 నుంచి 29 మధ్య వయస్కులు 35.3 శాతం ఉన్నారు. 2020తోపాలిస్టే ఇది 0.4 శాతం ఎక్కువ. చైనాలో ప్రస్తుతం ట్రెండ్‌గా మారిన ఆలస్య వివాహాలు కూడా ముగ్గురు పిల్లలకే జంటలను పరిమితం చేయాలన్న నిబంధనకు సవాలుగా మారుతుందని చైనా నిపుణులు పేర్కొంటున్నారు. అనేక దశాబ్దాలపాటు చైనాలో కొనసాగిన ఏక సంతాన విధానాన్ని రద్దు చేస్తూ 2016లో ఇద్దరు పిల్లల విధానానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. గత ఏడాది ఈ విధానాన్ని ముగ్గురు పిల్లలకు ప్రభుత్వం సవరించింది.

China Concerns over Lowest couple married in 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News