Monday, December 23, 2024

వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Revanth Reddy speech in YSR Death anniversary

 

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న మహా నాయకులు అని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రశంసించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పంజాగుట్ట లోని వైస్సార్ విగ్రహానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఆయన మరణం ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదని, తెలుగు ప్రజలందరికి తీరనిలోటు అని తెలిపారు. వైస్సార్ భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, ఇందిరమ్మ తర్వాత పేద ప్రజలకు అంతటి సంక్షేమ పథకాలు అందించిన మహా నేత రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్ల లాంటి పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News