Tuesday, January 21, 2025

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని సందర్శించిన డిహెచ్ శ్రీనివాస్ రావు

- Advertisement -
- Advertisement -

DH Srinivas Press meet on Ibrahimpatnam incident

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మీడియాతో మాట్లాడుతూ… 25 తేదీన కుటుంబం నియంత్రణ ఆపరేషన్ లో భాగంగా 34మందికి ఆపరేషన్ చేయటం జరిగిందన్నారు. అందులో నలుగురు మహిళలు చనిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. 30 మందికి హైద్రాబాద్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నాము. ప్రస్తుతం అందరు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఈ రోజు 12 మందిని ఇప్పటికే డిస్చార్జ్ చేశామని చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగత వారిని డిశ్చార్జి చేస్తామన్నారు. ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నేడు ఇక్కడ విజిట్ చేసిందని వివరించారు. ఆసుపత్రిలో వసతులు పరికరాలు, ఆపరేషన్ థియేటర్ పరిశీలించామని చెప్పుకొచ్చారు. 12లక్షల మందికి రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాము. అనుభజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఆపరేషన్లు జరిపామన్నారు. ఇబ్రహీంపట్నంలో 25న ఇక్కడ చేసిన డాక్టర్లే 26న చేవెళ్ల లో 60 మందికి చేశారన్న డిహెచ్ అక్కడ ఏ సమస్యా రాలేదని వెల్లడించారు. ఎక్కడ పొరపాటు జరిగిందీ అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాము. ప్రాథమిక విచారణలో ఇన్ఫెక్షన్ వలన జరిగిందనీ అంచనా వేసాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ , ఇక్కడ వాడిన వాడిని వాటిని పోరెన్సిక్ ల్యాబ్ కు పంపిచాం. పూర్తి స్థాయి రిపోర్ట్ రాగానే వివరాలు వెల్లడిస్తామమని శ్రీనివాస్ రావు అన్నారు.

రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలూ చేపడతామని హామీ ఇచ్చారు. 30 మంది మహిళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నామన్నారు. ఇప్పటికే చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్నీ విధాల ఆదుకుంటుందని సూచించారు. ఆపరేషన్ చేసుకున్న 30 గంటల తరువాత మహిళకు వాంతలు అయ్యాయి. చనిపోయిన వారి ఆపరేషన్స్ ముందూ తీసుకున్న ఫుడ్ విషయంలో కూడ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇక్కడ రెగ్యులర్ గా ఆపరేషన్స్ లు జరుగుతున్నాయి. ఆపరేషన్ కు ముందు పరికారాలు శుబ్రం చేశారు. ఇక్కడ వాడిన పరికరాలు చేవెళ్ల లో కూడ వాడారని ఆయన పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News