Friday, November 22, 2024

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను ప్రచురించాలి: శశి థరూర్

- Advertisement -
- Advertisement -

Shashi Tharoor

 

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ప్రచురించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారని అభిజ్ఞ వర్గాలు శుక్రవారం తెలిపాయి. అస్సాం ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ కూడా మిస్త్రీకి లేఖ రాసి ఓటర్ల జాబితాను బహిరంగపరచాలని కోరారు. ఓటర్ల జాబితాను ప్రచురించాలని డిమాండ్ చేస్తున్న స్వరాలు రోజురోజుకు బలంగా పెరుగుతుండగా, పార్టీలో చర్చ తీవ్రమవుతున్న నేపథ్యంలో వారి లేఖలు వస్తున్నాయి. తాను బరిలోకి దిగాలని ఆలోచిస్తున్న థరూర్,  మిస్త్రీకి లేఖ రాసి ఓటర్ల జాబితాను ప్రచురించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, థరూర్‌లు కూడా పారదర్శకత కోసం ఓటర్ల జాబితాలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాను ప్రచురించాలని డిమాండ్ చేస్తున్న నాయకులకు… కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ కౌంటర్ ఇచ్చారు, ‘‘వారు గందరగోళాన్ని సృష్టించవద్దని ,  ‘ఓపెన్ సిస్టమ్” గురించి గర్వపడాలని అన్నారు.

సెప్టెంబర్ 22న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబరు 8.  అవసరమైతే ఎన్నికలను అక్టోబర్ 17న నిర్వహించి.. ఫలితాలు అక్టోబర్ 19న వెలువడించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News