చెన్నై: ప్రేమ గుడ్డిదంటారు…నిజమే కామోసు. బహుశా దానికి ఈడు జోడు కూడా పట్టవేమో! తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ , ప్రముఖ నటి మహాలక్ష్మి పెళ్లి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. రవీందర్ చాలా లావుగా ఉంటాడు.. అలాగే మహాలక్ష్మి సన్నగా ఉంటుంది. వీరిద్దరి మధ్య కొన్నేళ్ల క్రితం ప్రేమ చిగురించింది. తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకుని ఒకటైపోయారు. ఆ వేడుకకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ జంట తమ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటోల్లో ఈ జంట సంప్రదాయ పెళ్లి బట్టల్లో వివరించలేనంతగా ఉంది. పెళ్లి ఫోటోలను షేర్ చేసిన మహాలక్ష్మి ‘నువ్వు జీవితంలోకి రావడం నా అదృష్టం.. నీ ప్రేమతో నా జీవితాన్ని సంపూర్ణం చేశావు.. లవ్ యూ అమ్మూ’ అని రాసుకొచ్చింది.
ఈ కొత్త జంట చేసిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఈ జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సూపర్ క్లిక్. రవి మీరు పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ మరి కొందరు.. ‘మీ ఇద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు’ అని కామెంట్స్ చేశారు. కాగా.. ‘మార్కండేయనుమ్ మగళిర్ కల్లూరియం’, ‘మురుంగై కాయ్ చిప్స్’ అనే సినిమాలకి దర్శకుడిగా, నిర్మాతగా రవీందర్‌కి తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది. అలాగే వీడియో జాకీగా కెరీర్‌ని మొదలుపెట్టిన మహాలక్ష్మీ తర్వాత నటిగా మారింది. అనంతరం ‘యామిరుక్క భయమేన్’, ‘అరసి’, ‘చెల్లమయ్’, ‘వాణి రాణి’, ‘పిళ్లై నీలా’ వంటి సీరియల్స్, అలాగే పలు సినిమాల్లోనూ యాక్ట్ చేసి నటిగా మంచి గుర్తింపు సాధించింది.