Friday, November 22, 2024

బేగంపేట మహిళా డిగ్రీ కాలేజీకి న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Begumpet Womens Degree College is recognized by NAAC A Plus

హర్షం వ్యక్తం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలోని బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలకు 2021-22 విద్యా సంవత్సరానికిగాను నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించడం పట్ల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వసతులు, బోధన, నిర్వహణ, ప్లేస్‌మెంట్స్ వంటి అంశాల ఆధారంగా నాక్ ప్రతినిధులు ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చారని మంత్రి తెలిపారు. శుక్రవారం నాడు తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. పద్మావతి,సిబ్బందిని మంత్రి సబిత ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ గ్రేడ్ సాధించిన 6 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సిబ్బందిని అభినందించారు. కళాశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి వినూత్నమైన విద్యా విధానాలతో రాష్టంలోనే పతాక స్థాయికి తీసుకువెళ్తున్న కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి స్కాలర్లు తమ పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు చేసే పరిశోధనల్లో సామాజిక కోణం ఉండేలా చూడాలని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News