Monday, December 23, 2024

పవర్ ప్యాక్డ్ పాత్రలో మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

Mega 154 Movie Huge Schedule started

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ(కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మూవీ మెగా 154. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కీలకమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్- అప్పీలింగ్ , పవర్- ప్యాక్డ్ పాత్రలో మెగాస్టార్‌ని చూపించబోతున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mega 154 Movie Huge Schedule started

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News