Saturday, November 23, 2024

నిర్మలా వ్యవహరించిన తీరు చూస్తే నాకే భయం వేసింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR respond on Nirmala sitharaman

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పటేల్‌తో వ్యవహరించిను తీరుపై మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో స్పందించారు. బిజెపి నాయకుల ప్రవర్తన చూసి సివిల్ అధికారులు భయపడుతున్నారని చురకలంటించారు. నిర్మలా సీతారామన్ ప్రవర్తన చూసిన తరువాత తనకు కూడా భయం వేసిందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. కామారెడ్డి కలెక్టర్‌కు అండగా నిలిచారు. కష్టపడి పని చేసే ఐఎఎస్ అధికారులను ఇలాంటి రాజకీయ నేతలు నిరుత్సాహపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లా బీర్కూర్‌లో రేషన్ దుకాణాన్ని కేంద్ర ఆర్థిఖ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సరుకుల పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌ను ఉద్దేశించి… బియ్యం పంపిణీ లో కేంద్రం వాటా ఎంత అని ప్రశ్నించారు. కలెక్టర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అరగంటలో తెలుసుకుని చెప్పాలని సూచించారు. ప్రతి రేషన్‌ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాని మోడీ చిత్రపటం ఉంచాలని సూచించారు. కేంద్రం వాటా కలెక్టర్‌కు తెలియదా అని, పిఎం మోడీ చిత్రపటం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. మోడీ ఫోటో పెట్టకుంటే కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నా రు. పేదలకు ట్రాన్స్‌పోర్టు ఖర్చులతోసహా కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీకి అన్నివిధాల సహకారం అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేయడంలేదని మంత్రి నిర్మల అన్నారు. కిలో బియ్యానికి 30 రూపాయలు కేంద్రం ఇస్తుంటే రాష్ట్రం ఐదు రూపాయలు ఇస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News