- Advertisement -
హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ పైన అక్రమంగా పిడి యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో గోషామహల్ నియోజకవర్గం బంద్ కు పిలుపునిచ్చింది. గోషామహల్ నియోజకవర్గంలోని మహారాజ్ గంజ్, ముక్తార్ గంజ్, కిషన్ గంజ్, ఉస్మాన్ షాహీ, అశోక్ బజార్, గౌలిగూడ, ఫిష్ మార్కెట్, సుల్తాన్ బజార్, బడిచౌడీ తదితర మార్కెట్లోని వ్యాపారులందరు స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి బంద్ కు సంపూర్ణంగా మద్దతు పలికారు. దీంతో గోషామహల్ నియోజకవర్గంలోని అన్ని ప్రధాన కూడలిలోని ఎక్కడ చూసిన రోడ్లు అన్ని నిర్మానుష్యంగా మారాయి. మొత్తం మీద గోషామహల్ నియోజకవర్గం బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.
- Advertisement -